శ్రీమాన్ శ్రీ వానమామలై వరదాచార్యుల వారు వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో శ్రీ బక్కయ్య శాస్త్రి - సీతమ్మ దంపతులకి ఆగష్టు 16, 1912 నాడు జన్మించారు.
సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించాడు. హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నారు.
శ్రీమద్భాగవతం అనే మహా గ్రంధాన్ని రచించిన శ్రీ పోతన గారి జీవిత చరిత్ర ని శ్రీమాన్ శ్రీ వానమామలై వరదాచార్యుల వారు రచించి గానం చేసారు.
ఆ అద్భుత రచనకి ఆయనకి అభినవ పోతన అనే బిరుదు లభించింది.
వరదాచార్యుల వారి జీవిత చరిత్ర ని శ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారు , శ్రీ వరదాభ్యుదయం అనే పద్య కావ్యం లో రచించారు.
తెలుగు సాహిత్య చరిత్ర లో వరదాచార్యుల వారిది ఒక విలక్షణ స్థానం.
ఆయన రాసిన మణిమాల గ్రంథాన్ని ఆంధ్రసారస్వతపరిషత్తు వారి ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశంగా ఉంచారు.
పురస్కారాలు, సత్కారాలు
1968లో పోతనచరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు.
1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యత్వము.
1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి వారిచే గండపెండేరం,స్వర్ణ కంకణం,రాత్నాభిషేకం
1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి వారిచే డి.లిట్ వాచస్పతి గౌరవ పట్టా
బిరుదులు
అభినవ కాళిదాసు
మహాకవి శిరోమణి
ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి
అభినవ పోతన
ఆంధ్ర కవివతంస
మధురకవి
కవికోకిల
కవిశిరోవతంస
శ్రీ వరదాచార్యుల వారు రచించిన వైశాలిని నాటకంలోని కొన్ని పద్యాలు.
వైశాలిని నాటకం.
కనరాని నను నీవు గర్భఃమ్మునందాచి
నవమాసములు పెంచు నాటి ఋణము
దుస్సహ ప్రసవార్తితోగని యొడిగట్టి
కంట గన్నిడి సాకు తొంటి ఋణము
రధిరమ్మె స్తన్యమై రూపుగ జేపురా
నర్లొంది చన్నిచ్చు నట్టిఋణము
సవ్యాపసవ్య హస్తములంటి యెత్తుచు
మూత్రపురీషాల మున్గ ఋణము
రోమరోమాల విరబారి రుథిరనాళ
సంతతులం బ్రవహించు నక్షయ ఋణమ్ము
జన్మమున్నంత వరకును జర్మమొలిచి
పాదరక్షలొనర్చినం బోదు జనని.
దైవసముడగు జనకుని సేవలోన
తలనుగోసి పీఠమునిడవలెను గాని
తండ్రియాజ్ఞ మించెడి దుష్టతనయు డెందు
పాత్ర దొనకు జీవనగతి పతనమొందు.
0 Comments