శ్రీ వరదాభ్యుదయం
Sri Varadabhyudayam
is a "Padya kavyam in Telugu", written by "Sri Pendyala Kishan Sharma", a rtd. Teacher in Sirpur Khagaznagar Town, Kumrumbhim District, Telangana,Inda
He has received many appreciations and awards for the book Varadaabhyudayam having more than 700 poems all about describing the life of
Srimaan Vanamamalai Varadacharyulu
right from his birth until his last breath.
Padya Kavyam is a Telugu Poetry book, containing many meaningful and artistic poems or padyaalu in telugu, describing a situation, a person
or any kind of a thing. They all contribute to Telugu Sahityam, that is considered as a treasure for Telugu literature lovers.
They are called Telugu sahitya padyalu.
Click here to know About Sri Vanamamalai Varadacharyulu
రచన :
🙏⁕ దేవతాస్తుతి ⁕ 🙏
కం.
శ్రీ రఘు రామ దయాకర
సారాసదళనేత్ర ! సాధుసజ్జన వంధ్యా!
ధీరాశ్రితజననుత మం
దారా! దయcజూప రార ! దశరథ రామా !!
కం.
చిద్రూపికి కరుణారస
ముద్రాంచిత నేత్రయుగళ మునిజనపతియో
నద్రిజ సుతునకు హితునకు
భద్ర యశం బొసుగుమనుచుసి బ్రణతులొనర్తున్
కం.
శ్రీధర ! మురళీధరప్రియ!
రాధామానస విహార | రాజమారాళా |
మాధవకృష్ణా | చిద్ఘన
మాధుర్య రసావతార | మంజులవేషా !
శా.
శ్రీ విద్యా పురిc జిత్కళామృతఝరీ | శ్రీ భద్ర కాళీశ్వరీ|
ఆవిర్భూత సహస్ర మంటప మహా హర్మ్యస్థ రాజేశ్వరీ|
దేవీ| కాకతి రాజ్యవైభవరమా | దీవ్యత్ కృపాసాగరీ|
సేవింతున్ తవపాద పద్మయుగళిన్ ,శ్రేయస్కరీ శ్రీకరీ !
గీ.
నాదు లేఖినీ ముఖమున నాట్యమాడ
శరణు వేడెద సతతము శిరము వంచి
తల్లి తడవేల వేగమె తరలి రావె
సరస కవిజన నికురుంబ శారదాంబ !
కవి పండిత ప్రశంస
గీ.
వ్యాస వల్మీక కవికులాగ్రేసరులకు
కాళిదాసాది విద్యాప్రకాండమతుల
కఖిల విద్యానిరూఢుల కార్షధర్మ
పథ విహర్తలకొనరింతు వందనంబు
ఉ.
నన్నయ తిక్కనార్యులును నాచనసోమన శంభుదాస సం
పన్న గురుప్రభందముల భాసిలు భవ్య మహాకవీంద్రులున్
పున్నెపుప్రోవులైన కవిపుంగవులెందరొ తెల్గుబాసకున్
వన్నెలు దిద్దినారు ఋషివర్యులు వారికి కేల్ఘటించెదన్
ఉ.
సొమ్ముల యాసలో బడక స్రుక్కకc గ్రుంగక కష్టమందు ,భా
వమ్మున రామచంద్రనృపు పాదములన్ విడనాడకుండా ,సొం
తమ్ముగ దెల్గుసోదరులు ధన్యత నొంద జగద్ధితార్థమై
కమ్మని యాంధ్ర భాగవత కావ్యము గూర్చిన పోతనార్యునిన్
శా.
ప్రతివర్ణంబును దేవతాతనువునుగా భావించి దర్శించి సం
స్తుతి పాత్రంబుగ దిద్దితీర్చి తెలుగున్ శోభాయమానంబుగా
మతినూహింప నశక్యమౌ కరణి సమ్మానించి సద్భక్తి వా
క్సతికిం బట్టము గట్టినావు వరదా సాహిత్య ధీశారదా !
ఉ.
ఒద్దికతోడ సత్క్రుతుల నోజదలిర్పగ జెప్పలేదు, నే
పెద్దరికమ్ము జూపుటకు పేరునొకించుక లేనివాడ, నీ
ముద్దుల గాథ దెల్పుటకు బుద్ధివికాసమొకింత లేదు, నా
కెద్దియో దారి నీ ఋణము నెవ్విధి దీర్చుకొనంగ జాలుదున్
ఉ.
నీ చరితంబు దెల్పుటకు నిక్కముగా దెలగానమందునన్
పూచిన పూవులట్లు కవిపుంగవులెందరొ నాడు నేడెటం
జూచిన గానవచ్చెదరు , చోద్యమదేమో కవీంద్ర , నాయెదన్
దూచితివీవు తూర్పుదిశ దోచేడు భానుని భంగి సత్కృపన్
చ.
అని తలపోయు నా హృదయమందున ,తత్క్షణ మందు రివ్వునన్ బనిగొనివచ్చి వ్రాలియొక్క
పట్టున నుండక సంచరించుచున్ మనమున నెద్దియో గొణుగు మౌని విధంబున నొప్పు కోకిలన్
ఘనమున స్వాగతించుట కేగాదిగ జూచుచు నిట్లు బల్కితిన్
Comments
Post a Comment