Telugu Lyrics
ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నెన్నో శుభ గాథలెన్నెన్నో
మాయని తీపి మహిమలు గల లీలలెన్నెన్నో నవ లీలలెన్నెన్నో
కృష్ణ చరితము మధుర సుధాభరితము
కృష్ణ చరితము మధుర సుధాభరితము
శ్రవణాష్టమి నడిరాతిరి స్వామి జనించే జగమెల్ల హర్షించే
నందనందనుడై రేపల్లియలోన చరించే యశోదమ్మ తరించే
పూతనాది దానవుల పొగరు హరించే
పూతనాది దానవుల పొగరు హరించే
మును వెన్నెలతో పాటుగా మన్ను భుజించే కన్నియల వరించే
కృష్ణ చరితము మధుర సుధాభరితము
కృష్ణ చరితము మధుర సుధాభరితము
కాళీయుని పడగలపై కేళి ఘటించే ముని కోటి భజించే
వరగోవర్ధన శైలమెత్తి గోట ధరించే గోరక్ష లభించే
మోహనమౌ వేణువూది మోహము పెంచే
మోహనమౌ వేణువూది మోహము పెంచే
సురవైరులైన కంసాదుల పొంకమడంచే
ప్రతి యెదల వసించే
ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నెన్నో శుభగాథలెన్నెన్నో
మాయని తీపి మహిమలు గల లీలలెన్నో నవ లీలలెన్నెన్నో
కృష్ణ చరితము మధుర సుధాభరితము
కృష్ణ చరితము మధుర సుధాభరితము
0 Comments