Seetamma Bathukamma Song LYRICS

జనక జనకుని ఇంట్లో ఉయ్యాలో

పుణ్య జనకుని ఇంట్లో ఉయ్యాలో

పుట్టింది సీతమ్మ ఉయ్యాలో

పురుడు కోరింది ఉయ్యాలో

పెరిగింది సీతమ్మ ఉయ్యాలో

పెళ్లి కోరింది ఉయ్యాలో

నడుస్తూనే సీతమ్మ ఉయ్యాలో

నాగవెల్లి కోరే ఉయ్యాలో

చిన్న చిన్న అరుగులు ఉయ్యాలో

అలుకా నేర్చింది ఉయ్యాలో

చిత్తారి ముగ్గులు ఉయ్యాలో

పెట్టా నేర్చింది ఉయ్యాలో

చిన్న చిన్న రోకల్లో ఉయ్యాలో

దంచా నేర్చింది ఉయ్యాలో
చిన్న చిన్న మోంటెల్లో ఉయ్యాలో

చెరుగ నేర్చింది ఉయ్యాలో

చిన్న చిన్న బిందెల్లో ఉయ్యాలో

వండా నేర్చింది ఉయ్యాలో

తన తోటి చిన్నలకి ఉయ్యాలో

పెట్టా నేర్చింది ఉయ్యాలో

పెద్ద పెద్ద అరుగులు ఉయ్యాలో

అలుకా నేర్చింది ఉయ్యాలో

పెద్ద పెద్ద ముగ్గులు ఉయ్యాలో

పెట్టా నేర్చింది ఉయ్యాలో

పెద్ద పెద్ద రోకల్లో ఉయ్యాలో

దంచా నేర్చింది ఉయ్యాలో

పెద్ద పెద్ద చాటల్లో ఉయ్యాలో

చెరుగ నేర్చింది ఉయ్యాలో

పెద్ద పెద్ద బిందెల్లో ఉయ్యాలో

వండా నేర్చింది ఉయ్యాలో

తన తోటి పెద్దలకి ఉయ్యాలో

పెట్టా నేర్చింది ఉయ్యాలో

తూరుపు రాజులూ ఉయ్యాలో

సీతనడగ వచ్చిరి ఉయ్యాలో

వారు వచ్చి అయోధ్య ఉయ్యాలో

తోటల్లో దిగిరి ఉయ్యాలో


విల్లు విరిచిన వారికి ఉయ్యాలో

ఈ సీతని ఇస్తాము ఉయ్యాలో

విల్లు విరవలేక ఉయ్యాలో

వారు వెళ్లి పోయిరి ఉయ్యాలో

దక్షిణ రాజులూ ఉయ్యాలో

సీతనడగ వచ్చిరి ఉయ్యాలో

వారు వచ్చి అయోధ్య ఉయ్యాలో

తోటల్లో దిగిరి ఉయ్యాలో

విల్లు విరిచిన వారికి ఉయ్యాలో

ఈ సీతని ఇస్తాము ఉయ్యాలో

విల్లు విరవలేక ఉయ్యాలో

వారు వెళ్లి పోయిరి ఉయ్యాలో

పడమర రాజులూ ఉయ్యాలో

సీతనడగ వచ్చిరి ఉయ్యాలో

వారు వచ్చి అయోధ్య ఉయ్యాలో

తోటల్లో దిగిరి ఉయ్యాలో

విల్లు విరిచిన వారికి ఉయ్యాలో

ఈ సీతని ఇస్తాము ఉయ్యాలో

విల్లు విరవలేక ఉయ్యాలో

వారు వెళ్లి పోయిరి ఉయ్యాలో

ఉత్తర రాజులూ ఉయ్యాలో

సీతనడగ వచ్చిరి ఉయ్యాలో

వారు వచ్చి అయోధ్య ఉయ్యాలో

తోటల్లో దిగిరి ఉయ్యాలో

విల్లు విరిచిన వారికి ఉయ్యాలో

ఈ సీతని ఇస్తాము ఉయ్యాలో

విల్లు విరవలేక ఉయ్యాలో

వారు వెళ్లి పోయిరి ఉయ్యాలో

రామన్న లక్ష్మన్న ఉయ్యాలో

సీతనడగ వచ్చిరి ఉయ్యాలో

వారు వచ్చి అయోధ్య ఉయ్యాలో

తోటల్లో దిగిరి ఉయ్యాలో

విల్లు విరిచిన వారికి ఉయ్యాలో

ఈ సీతని ఇస్తాము ఉయ్యాలో

విల్లు విరుస్తామని ఉయ్యాలో

విడమందుకున్నారు ఉయ్యాలో

చిట చిట విల్లు విరిచి ఉయ్యాలో

సీతను పెండ్లాడె ఉయ్యాలో

పట పట విల్లు విరిచి ఉయ్యాలో

పడతిని పెండ్లాడె ఉయ్యాలో

For more Songs Lyrics click here⋙