మంగళ ప్రదదాయిని మము రక్షించే మహనీయ గుణదాయిని -
 Ammavari old Mangala Harathi Song With Lyrics
  
Lyricist : Sri Chandrashekara Sharma,Chennur
 ఆట తాళము :
 
మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని
మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని
మంగళ ప్రదమైన నీదు మంత్రమును జపియించు వారికి  
అంగు గాను సర్వ వాంఛ లొసంగు జననీ నీకు మ్రొక్కెద  
మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని
సకల లోక వ్యాపినీ - సకలంబు నీవై ప్రకటింత గుణ శాలినీ 
 
లోక పాలకులైన బ్రహ్మ రుద్రా విష్ణు దేవతలును 
ప్రాకటంబుగ నీదు మహిమా పారమును గుర్తెరుగ లేరట 
 మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని
నిరుపమ పద చారిణి-నీ భక్తులను కరుణించు శుభకారిణి
మేరు సమవర ధీర ధారిణి-యాది రూపా కారిణి 
యోంకార రూపిణి -వేదం శాస్త్ర విచారిని -సకల శుభ కారిణి 
 మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని
సుందర పురవాసినీ-శ్రీ చంద్ర దాసా హృదయ మందిర వాసినీ 
అందముగను నీదు సత్క్రుప -బొందితిని నాకందరానిది 
యెందు చూచిన లేదు జగము -నందు జయము కలిగే జననీ 
 మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని
Comments
Post a Comment