Skip to main content

Sri Vanamamalai Varadacharyulu

శ్రీ వానమామలై వరదాచార్యులు జీవిత చరిత్ర

శ్రీ వానమామలై వరదాచార్యులు

శ్రీ వరదాభ్యుదయం - పద్య కావ్యం (తెలుగు పద్యాలు చూడండి)

జననము - విద్యాభ్యాసం

శ్రీమాన్ శ్రీ వానమామలై వరదాచార్యులు వారు వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో శ్రీ బక్కయ్య శాస్త్రి మరియు సీతమ్మ దంపతులకు 1912 ఆగష్టు 16న జన్మించారు.

వారు సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించి, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించారు. హరికథాగానంలో ప్రావీణ్యతను కూడా సాధించారు.

సాహితీ కృషి

శ్రీ పోతన గారి జీవిత చరిత్రను రచించి గానం చేసినందుకు శ్రీ వరదాచార్యులకు "అభినవ పోతన" అనే బిరుదు లభించింది. వారు రచించిన మణిమాల గ్రంథాన్ని ఆంధ్రసారస్వత పరిషత్తు వారు ఆంధ్ర విశారద పరీక్షలో పాఠ్యాంశంగా చేర్చారు.

పురస్కారాలు - గౌరవాలు

  • 1968: పోతనచరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
  • 1971: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యత్వం
  • 1973: కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి గౌరవం - గండపెండేరం, స్వర్ణ కంకణం, రత్నాభిషేకం
  • 1976: డి.లిట్ (వాచస్పతి) గౌరవ పట్టా - సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి

ప్రఖ్యాత బిరుదులు

అభినవ కాళిదాసు
మహాకవి శిరోమణి
ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి
అభినవ పోతన
ఆంధ్ర కవివతంస
మధురకవి
కవికోకిల
కవిశిరోవతంస
శ్రీ వరదాచార్యుల వారు రచించిన వైశాలిని నాటకంలోని కొన్ని పద్యాలు.

వైశాలిని నాటకం.


కనరాని నను నీవు గర్భఃమ్మునందాచి
నవమాసములు పెంచు నాటి ఋణము
దుస్సహ ప్రసవార్తితోగని యొడిగట్టి
కంట గన్నిడి సాకు తొంటి ఋణము
రధిరమ్మె స్తన్యమై రూపుగ జేపురా
నర్లొంది చన్నిచ్చు నట్టిఋణము
సవ్యాపసవ్య హస్తములంటి యెత్తుచు
మూత్రపురీషాల మున్గ ఋణము

రోమరోమాల విరబారి రుథిరనాళ
సంతతులం బ్రవహించు నక్షయ ఋణమ్ము
జన్మమున్నంత వరకును జర్మమొలిచి
పాదరక్షలొనర్చినం బోదు జనని.

దైవసముడగు జనకుని సేవలోన
తలనుగోసి పీఠమునిడవలెను గాని
తండ్రియాజ్ఞ మించెడి దుష్టతనయు డెందు
పాత్ర దొనకు జీవనగతి పతనమొందు.



Comments