Skip to main content

హారతివ్వరే సత్యనారాయణ స్వామి

Category: Mangala Harathi Lyrics| Language: తెలుగు
హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ
నేఱుపు తోడ బంగారు పళ్ళెరమున
కురీమి మీర కర్పూరము వెలిగించి
సారె సారె కు కదలి ఫలములు నారికేళము కండ శరకర
చార పలుకులు పనసనులు ఖర్జూర ఫలముల నొసగుచు
జయ హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ

మున్ను నారద ముని ఎన్నెన్నో జగముల పన్నుగ తిరిగి తిరిగి
క్రన్నాన మర్త్య లోకము జేరి జనముల
ఎన్న వశము గాని ఈతి బాధలు బడుచున్న వారిని జూచి మరి మరి
కిన్నుడై వైకుంఠమున యాపన్న రక్షకు హరిని జేరియు
విన్నవించగ వ్రతము తెలిపెను
హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ

కాశీక పురిని వరనేషుడొక్కరుఁడు మహా ఆశ దుఃఖమున నుండ
శేషశేయణుడు వృద్ధ వేషముతో వచ్చి ఆశిష్షు చే వ్రతము అమర జేయగ దెలుప
ఆశ చేతను వ్రతము సలుపగ నంతటను కష్టముల నమ్మెడు
వేషమున నంత్యజుడు జూపె సంతోషమును కలిగెను ముదంబున
హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ

ఘనుడుల్క ముఖుడాను మనుజేంద్రుడొకనాడు తను యార్తి యై నోమగా
కను సాధుగను వైశ్యుడు నాకు సంతానమును గల్గినంతనె
ననుమానము మాని ఘనముగా నీ వ్రతము సలిపెద ననుచు నుండగ కొన్ని నాళ్లకు
కనియె పుత్రిని సుగుణ గాత్రిని కళావతి అను చిన్న దానిని
హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ

పాదపాటి వైశ్యుడు సుదతికి పెండ్లి అతి ముదముతో చేసి అపుడు
మధుసూదనుని వ్రతము మాని బేరమునకై
మదిలో కోరిక హెచ్చి మరి అల్లుడును తాను
కదిలె రాతనాసానుపురముకు వివిధముగ పోవంగ స్వామికి
మదిలొ కోపం హెచ్చి శాపంబదిగొ కష్టము ప్రాప్తమగుననె
హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ

అంతట చోరులు అధిక ద్రవ్యము వీరి చెంత నుంచియు చాణగా
వింత భటులు రాజు చెంత నిలిపిన వీరి
ఇంతక వరమాని ఇదే బందిఖానాలో
ఇంతలోపల వీరి సుదతుల కెంతయో కష్టములు గలిగిన
కాంతు జనకుని వ్రతము సలిపిన కష్టములు తొలగియు సుఖించిరి
హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ

ధరతుంగధ్వజుడాను నర వారుడును వేట కొరకై వనమున కెఱిఁగియు
కరుకు మృగముల ద్రుంచి సరగ వట వృక్షంబు
దరికి జేరగ లోక వరదు వ్రతమును ప్రీతి కరము గను గోపకులు సలుపగ
గాంచి ప్రాసాదంబు గ్రోలగ పురిగి జేరగ
పుత్ర శతమును భోగ వ్రతమును సలిపి గాంచెను
హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ

సచ్చిదానందుడౌ సత్య దేవుని వ్రతము
సత్యమౌ హృదయంబున హెచ్చయిన కోరిక చే
ఇలను చేసిన వారికిచ్చు సౌఖ్యములను ఇహ పరములయందు
బుచ్చి కృష్ణా దాసునీధర బ్రోచిన శ్రీ వాసుదేవుని సచ్చరిత్రము
వినియు యదుకుల సార్వ భౌముని కనిషముగ
జయ హారతివ్వరే సత్యనారాయణ స్వామి జేరి సుదతులందరూ

Comments