శ్రీ వానమామలై వరదాచార్యులు జీవిత చరిత్ర           శ్రీ వానమామలై వరదాచార్యులు          శ్రీ వరదాభ్యుదయం - పద్య కావ్యం (తెలుగు పద్యాలు చూడండి)       జననము - విద్యాభ్యాసం         శ్రీమాన్ శ్రీ వానమామలై వరదాచార్యులు వారు వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో శ్రీ బక్కయ్య శాస్త్రి మరియు సీతమ్మ దంపతులకు 1912 ఆగష్టు 16న జన్మించారు.           వారు సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించి, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించారు. హరికథాగానంలో ప్రావీణ్యతను కూడా సాధించారు.       సాహితీ కృషి         శ్రీ పోతన గారి జీవిత చరిత్రను రచించి గానం చేసినందుకు శ్రీ వరదాచార్యులకు "అభినవ పోతన" అనే బిరుదు లభించింది. వారు రచించిన మణిమాల  గ్రంథాన్ని ఆంధ్రసారస్వత పరిషత్తు వారు ఆంధ్ర విశారద పరీక్షలో పాఠ్యాంశంగా చేర్చారు.       పురస్కారాలు - గౌరవాలు                1968: పోతనచరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు        1971: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యత్వం        1973: కరీంనగర్ జిల్లా కోరుట...